మేడారం జాతర కు హెలికాప్టర్ లో ....
తెలంగాణ కుంభమేళ శ్రీ సమ్మక్క - సారలమ్మల మహాజాతర సందర్భంగా తెలంగాణ పర్యాటక శాఖ అద్వర్యంలో పర్యాటకుల మరియు భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ బేగం పేట విమానాశ్రయం నుండి మేడారం కు హెలికాప్టర్ సేవలను రాష్ట్ర అబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్ గారు బేగంపేట్ లోని పాత ఎయిర్ పోర్ట్ లో ప్రారంబించారు. ఈ టూరిజం ప్యాకేజీ లో బాగంగా బేగంపేట ఎయిర్ పోర్టు నుండి మేడారం , మేడారం నుండి హైదరాబాద్ లోని బేగం పేట ఎయిర్ పోర్టు వరకు నిర్వహిస్తున్నామన్నారు. హైదరాబాద్ నుండి 6 గురు ప్రయాణికులకు 1లక్ష 80 వేలు తో పాటు జి యస్ టి (1.80.000 + జి యస్ టి) ఉంటుందన్నారు.వీటితో పాటు మేడారం జాతర వ్యూ హెలిక్యాప్టర్ నుండి చూసేందుకు ప్రతి ప్రయాణికుడికి 2999.00 నామ మాత్రపు చార్జీ తో మేడారం శ్రీ సమ్మక్క - సారలమ్మ ల మహా జాతర కు వచ్చిన భక్తులకు మరియు పర్యాటకులకు హెలిక్యాప్టర్ లో విహరించే అద్బుత అవకాశం ను తెలంగాణ పర్యాటక శాఖ కల్పించిందన్నారు. పర్యాటకులు హెలిక్యాప్టర్ సదుపాయం ను ఉపయేగించుకోవటానికి సంప్రదించవలసిన పోన్ నెంబర్ 94003 99999 ను సంప్రదించాలని మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ బుర్రా వెంకటేశం, టూరిజం ఛైర్మన్ శ్రీ భూపతి రెడ్డి, రాష్ట్ర పౌర విమానయాన శాఖ డైరెక్టర్ శ్రీ. భరత్ రెడ్డి, టూరిజం MD మనోహర్ మరియు పర్యాటక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.