వ్యవసాయానికి పెద్దపీట
కేంద్ర బడ్జెట్ 2020-21 లో ముఖ్యాంశాలు
న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 01, 2020
21వ శతాబ్దం లో మూడవ దశాబ్ది యొక్క తొలి కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారమణ్ ఈ రోజు న పార్లమెంటు కు సమర్పించారు. దీనిలో దీర్ఘకాలిక ప్రభావాన్ని కలిగినటువంటి అనేక సంస్కరణలను ప్రకటించడం జరిగింది. స్వల్పకాలిక, మధ్యకాలిక మరియు దీర్ఘకాలిక చర్యల ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థ కు శక్తి ని అందించాలన్నది ఈ సంస్కరణ ల ధ్యేయం గా ఉంది.
కేంద్ర బడ్జెట్ 2020-21 లో కీలకమైన ముఖ్య అంశాలు ఈ క్రింది విధం గా ఉన్నాయి:
బడ్జెట్ లోని మూడు ప్రధాన ఇతివృత్తాలు
- ఆకాంక్షభరిత భారతదేశం- సమాజం లో అన్ని వర్గాల వారికి ఆరోగ్యం, విద్య మరియు ఉత్తమ ఉద్యోగాలతో కూడిన మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు అందాలి.
- అందరి కోసం ఆర్థికాభివృద్ధి – ‘‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్.’’
- బాధ్యత కలిగిన సమాజం- మానవీయమైన మరియు దయాళువైన సమాజం; ధర్మానికి ఆధారం గా అంత్యోదయ.
o అవినీతి కి తావు లేని విధానాలు చోదక శక్తి గా ఉన్నటువంటి సుపరిపాలన
o స్వచ్ఛమైన మరియు సుదృఢమైన ఆర్థిక రంగం..
ఈ రెండింటి ద్వారా స్థూలమైన మూడు ఇతివృత్తాలను జతపరచడం జరుగుతుంది.
- కేంద్ర బడ్జెట్ 2020-21 లో మూడు ఇతివృత్తాల ను ఈజ్ ఆఫ్ లివింగ్ నొక్కి వక్కాణించింది.
ఆకాంక్షభరిత భారతదేశం లో మూడు భాగాలు:
- వ్యవసాయం, సాగునీటిపారుదల మరియు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి,
- ఆరోగ్యం, జలం మరియు పారిశుధ్యం.
- విద్య మరియు నైపుణ్యాలు
వ్యవసాయం, సాగునీటిపారుదల, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ల కోసం 16 కార్య ప్రణాలికలు.
- దిగువన పేర్కొన్న 16 అంశాల కార్య ప్రణాళిక కోసం 2.83 లక్షల కోట్ల రూపాయలను కేటాయించనున్నారు.
o వ్యవసాయం, సాగునీటి పారుదల మరియు సంబంధిత కార్యకలాపాల కోసం 1.60 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించనున్నారు.
o గ్రామీణ అభివృద్ధి కోసం మరియు పంచాయతీ రాజ్ కోసం 1.23 లక్షల కోట్ల రూపాయలను వెచ్చిస్తారు.
- వ్యవసాయ రుణం:
o 2020-21 సంవత్సరానికి గాను 15 లక్షల కోట్ల రూపాయల లక్ష్యాన్ని నిర్దేశించడమైంది.
o పిఎం-కిసాన్ లబ్ధిదారులకు కెసిసి పథకాన్ని వర్తింపచేయాలన్న ప్రతిపాదన.
o నాబార్డ్ రీ-ఫైనాన్స్ స్కీమ్ ను మరింతగా విస్తరించడం జరుగుతుంది.
- నీటి ఎద్దడి ని ఎదుర్కొంటున్న 100 జిల్లాలకు సమగ్రమైన చర్యలను ప్రతిపాదించడమైంది.
- నీలి ఆర్థిక వ్యవస్థ.
- 2024-25 కల్లా 1 లక్ష కోట్ల రూపాయల మత్స్యరంగ ఎగుమతులను సాధించాలనేది లక్ష్యం.
- 2022-23 కల్లా 200 లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తులను లక్ష్యం గా పెట్టుకోవడమైంది.
- మత్స్య పరిశ్రమ విస్తరణలో యువతను భాగస్తుల ను చేయడం కోసం 3477 సాగర్ మిత్రా లు మరియు 500 మత్స్య రైతు నిర్మాత సంస్థల ఏర్పాటు.
- నాచు ను, సముద్ర కలుపు జాతుల ను పెంచడం తో పాటు కేజ్ కల్చర్ లను ప్రోత్సహించనున్నారు.
- సముద్ర సంబంధ మత్స్య వనరుల సంరక్షణ, నిర్వహణ మరియు అభివృద్ధి ల కోసం ఫ్రేమ్ వర్క్ నిర్మాణం.
- భారతీయ రైల్వేలు పిపిపి ద్వారా కిసాన్ రైల్ వ్యవస్థను నెలకొల్పుతుంది:
o పాలు, మాసం, చేపల వంటి త్వరగా పాడైపోయే పదార్థాల కోసం ఒక నిరంతరాయ జాతీయ శీతలీకృత సరఫరా వలయాన్ని ఏర్పాటు చేయనున్నారు.
o ఎక్స్ ప్రెస్ రైళ్ళ లోను, ఫ్రైట్ రైళ్ళ లోను శీతలీకరించిన రైలు పెట్టెలను ఏర్పాటు చేస్తారు.
- పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కృషి ఉడాన్ లను మొదలు పెడుతుంది.
o జాతీయ మార్గాల తో పాటు, అంతర్జాతీయ మార్గాలను కూడా దీనికి జోడిస్తారు.
o ఈశాన్య ప్రాంత జిల్లాలు మరియు ఆదివాసీ సముదాయాలు అధికంగా నివసించే జిల్లాల లో వ్యవసాయ ఉత్పత్తుల విలువను మెరుగు పరచేందుకు చొరవ తీసుకోవడం జరుగుతుంది.
- ఉద్యానవనాల రంగం లో మెరుగైన మార్కెటింగ్ మరియు ఎగుమతి లక్ష్య సాధన కోసం వన్-ప్రాడక్ట్ వన్ - డిస్ట్రిక్ట్ పథకాన్ని ప్రవేశపెడతారు.
- సాంప్రదాయిక సేంద్రియ ఎరువులు మరియు క్రొత్త క్రొత్త ఎరువుల రకాల సంతులిత వాడకం.
- సేంద్రియ వ్యవసాయం, ప్రాకృతిక వ్యవసాయం మరియు సమీకృత వ్యవసాయం ల దిశగా చర్యలు చేపడుతారు. వాటిలో..
o జైవిక్ ఖేతీ పోర్టల్ – సేంద్రియ ఉత్పత్తుల కు సంబంధించిన జాతీయ ఆన్ లైన్ బజారు ను బలోపేతం చేస్తారు.
o జీరో–బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ (జులై 2019 బడ్జెట్ లో దీనిని ప్రస్తావించడమైంది)ని కూడా దీనిలో చేర్చుతారు.
o వర్షాధార ప్రాంతాల లో సమీకృత సాగు వ్యవస్థల ను విస్తరించడం జరుగుతుంది.
o పంటకాలం కానటువంటి వేళల్లో బహుళ అంచెల పంటల పద్ధతి ని, తేనెటీగల పెంపకాన్ని, సోలర్ పంపులను, సౌర శక్తి ఉత్పత్తి ని కూడా జోడించనున్నారు.
- పిఎం-కుసుమ్ ను విస్తరించనున్నారు.
o సోలర్ పంపులను ఏర్పాటు చేయడం కోసం 20 లక్షల మంది రైతులకు అండదండలు కల్పిస్తారు.
o మరొక 15 లక్షల మంది రైతులకు వారి యొక్క గ్రిడ్ సంధానిత పంప్ సెట్లను సౌరశక్తి తో పని చేసే విధంగా తీర్చిదిద్దుకొనేందుకు అవసరమైన సహాయాన్ని అందిస్తారు.
o రైతులు వారి యొక్క బంజరు భూముల లోను మరియు ఫలించని భూముల లోను సౌర విద్యుత్తు ఉత్పాదనకు నడుం కట్టి ఆ తరహా విద్యుత్తు ను గ్రిడ్ కు విక్రయించేందుకు వీలు కల్పించేటటువంటి ఒక పథకాన్ని అమలు చేస్తారు.
- గ్రామంలో నిల్వ పథకం:
o రైతుల కు ఒక చక్కనైన నిల్వ సామర్ధ్యాన్ని అందుబాటు లోకి తెచ్చి వారి లాజిస్టిక్స్ సంబంధిత ఖర్చును తగ్గించడం కోసం స్వయంసహాయసమూహాలు (ఎస్ హెచ్ జి) లు విలేజ్ స్టోరేజి స్కీము ను నిర్వహించనున్నాయి.
o మహిళలు మరియు ఎస్ హెచ్ జి లు ధన్య లక్ష్మి పథకానికి తమ వంతు తోడ్పాటును అందించవలసి ఉంటుంది.
- వ్యవసాయ సంబంధిత గిడ్డంగులు, శీతలీకరించిన నిల్వ కేంద్రాలు, రీఫర్ వ్యాన్ సదుపాయాలు వంటి వాటిని నాబార్డ్ మ్యాపింగ్ చేసి, వాటికి జియో ట్యాగ్ లను సమకూర్చనుంది.
- వేర్ హౌస్ డివెలప్ మెంట్ అండ్ రెగ్యులేటరీ ఆథారిటి (డబ్ల్యుడిఆర్ఎ) ద్వారా గోదాముల స్థాపన కు నియమాలను తీర్చిదిద్దుతారు:
o ఆ కోవకు చెందిన గోదాములను బ్లాక్ స్థాయి లోను/తాలూకా స్థాయి లోను నెలకొల్పేందుకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ చేపడుతారు.
o భారత ఆహార సంస్థ (ఎఫ్ సిఐ) మరియు సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేశన్ (సిడబ్ల్యుసి)లు కూడా వాటి స్థలాలలో ఈ తరహా గోదాములను నిర్మిస్తాయి.
- నెగోషియబుల్ వేర్ హౌసింగ్ రిసీట్స్ (ఇ-ఎన్ డబ్ల్యుఆర్) సంబంధిత ఆర్థిక సహాయాన్ని ను ఇ-ఎన్ఎఎమ్ తో ఏకీకృతం చేయడం జరుగుతుంది.
- కేంద్ర ప్రభుత్వం జారీ చేసే మాడల్ చట్టాల ను అమలు పరచే రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రోత్సాహాన్ని ఇవ్వడం జరుగుతుంది.
- పశు సంపద:
o మిల్క్ ప్రోసెసింగ్ సామర్ధ్యాన్ని 2025 కల్లా 53.5 మిలియన్ మెట్రిక్ టన్నుల నుండి రెండింతలు చేసి 108 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచడం జరుగుతుంది.
o కృత్రిమ గర్భధారణ కవరేజీ ని ప్రస్తుతం ఉన్న 30 శాతం నుండి 70 శాతానికి పెంచడం జరుగుతుంది.
o పశుదాణా క్షేత్రాల ను అభివృద్ధి పరచేందుకు ఎంఎన్ఆర్ఇజిఎస్ నుండి సాయాన్ని ఇవ్వడం జరుగుతుంది.
o పశువుల లో గాలికుంటు వ్యాధి మరియు బ్రూసిలోసిస్ లను మరియు మేకల లోను, గొర్రెల లోను సోకేటటువంటి పిపిఆర్ వ్యాధిని 2025 కల్లా అంతమొందించాలనేది లక్ష్యం.
- దీన్ దయాళ్ అంత్యోదయ యోజన – పేదరిక నిర్మూలన కోసం 58 లక్షల ఎస్ హెచ్ జి ల తో 0.5 కోట్ల కుటుంబాల ను జోడించడమైంది.
వెల్ నెస్, నీరు మరియు పారిశుధ్యం.
- ఆరోగ్య సంరక్షణ రంగం కోసం 69,000 కోట్ల రూపాయల ను కేటాయించడమైనది
- పిఎం జన్ ఆరోగ్య యోజన (పిఎం జెఎవై) కోసం 6400 కోట్ల రూపాయలు (69,000 కోట్ల రూపాయల లో నుండి) కేటాయించడమైంది.
o పిఎం జెఎవై లో భాగంగా 20,000కు పైగా ఆసుపత్రులను ప్యానల్ లో ఇప్పటికే చేర్చడం పూర్తి అయింది.
o వైద్య శాలల ను పిపిపి పద్ధతి లో ఏర్పాటు చేసేందుకు గాను వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ సౌకర్యాన్ని ప్రతిపాదించడమైంది.
o ఆయుష్మాన్ కు జోడించిన ప్యానల్ లో చేరిన వైద్యశాలలంటూ ఏవీ లేనటువంటి ఆకాంక్షభరిత జిల్లాలను తొలి దశ లో కవర్ చేయడం జరుగుతుంది.
o మశీన్ లర్నింగ్ మరియు ఆర్టిఫిశియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ)ల సాయం తో సముచితమైన నివారక పద్ధతుల ను ఉపయోగించి, వ్యాధుల తగ్గింపునకు నడుం బిగిస్తారు.
- జన్ ఔషధి కేంద్ర పథకం లో భాగం గా 2024 కల్లా అన్ని జిల్లాల లో 2000 మందులను మరియు 300 శస్త్ర చికిత్స సంబంధిత పరికరాలను సమకూర్చుతారు.
- క్షయ వ్యాధి ని 2025 కల్లా అంతమొందించాలన్న వాగ్ధానాన్ని నెరవేర్చేందుకు టిబి హారేగా దేశ్ జీతేగా ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించడమైంది.
- జల్ జీవన్ మిశన్ కోసం 3.60 లక్షల కోట్ల రూపాయలకు ఆమోదం తెలపడమైంది.
o 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను 11,500 కోట్ల రూపాయలను వెచ్చిస్తారు.
o స్థానిక జల వనరులను వృద్ధి చేస్తారు. ఇప్పటికే అందుబాటు లో ఉన్న వనరులను రీచార్జ్ చేయడం జరుగుతుంది. అంతేకాదు, ఇంకుడుగుంతలను, నిర్లవణీకరణ ను ప్రోత్సహించడం జరుగుతుంది.
o మిలియన్ కు పైబడిన జనాభా గల నగరాల ను ప్రస్తుత సంవత్సరం లోనే ఈ లక్ష్య సాధన దిశ గా ప్రోత్సహిస్తారు.
- స్వచ్ఛ్ భారత్ మిశన్ కోసం 2020-21 లో 12,300 కోట్ల రూపాయల కేటాయింపు:
o ఒడిఎఫ్ తో మిళితమైన ప్రవర్తన ను ప్రోత్సహించడం కోసం ఒడిఎఫ్ – ప్లస్ వాగ్దానం.
o లిక్విడ్ మరియు గ్రే వాటర్ మేనేజ్ మెంట్ విషయం లో శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది.
o ఘన వ్యర్థాల సేకరణ, మూలం లోనే వేరు చేయడం, అలాగే ప్రోసెసింగ్ పైన సైతం శ్రద్ధ వహిస్తారు.
విద్య మరియు ప్రావీణ్యాలు
- 2020-21 లో విద్యారంగానికి 99,300 కోట్ల రూపాయలు, నైపుణ్యాల అభివృద్ధి కి 3,000 కోట్ల రూపాయలు.
- త్వరలోనే జాతీయ విద్యా విధానాన్ని ప్రకటించడం జరుగుతుంది.
- విజ్ఞాన శాస్త్రం, న్యాయ సంబంధిత విజ్ఞాన శాస్త్రం మరియు సైబర్ ఫోరెన్సిక్స్ రంగాలకు మద్ధతుగా జాతీయ పోలీసు విశ్వవిద్యాలయాన్ని, అలాగే నేశనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడమైంది.
- నేశనల్ ఇన్ స్టిట్యూశనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ లో అగ్రగామి 100 సంస్థలు డిగ్రీ స్థాయి ఆన్ లైన్ విద్యా కార్యక్రమాన్ని నిర్వహిస్తాయి.
- . నూతన ఇంజినీర్లకు ఒక సంవత్సరం వ్యవధి తో కూడిన ఇంటర్న్ శిప్ ను పట్టణ స్థానిక సంస్థలు అందిస్తాయి.
- ఇప్పటికే నడుస్తున్న జిల్లా ఆసుపత్రి కి ఒక వైద్య కళాశాల ను పిపిపి పద్ధతి లో అనుబంధం చేయాలని బడ్జెట్ ప్రతిపాదిస్తున్నది.
- ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ లు ప్రత్యేకం గా బ్రిడ్జి కోర్సుల ను రూపొందిస్తాయి:
o ఉపాధ్యాయులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది మరియు విదేశాల లో సంరక్షణ సేవల ప్రదాతల కు ఉన్నటువంటి డిమాండును తీర్చడం కోసం.
o అలాగే శ్రామిక సిబ్బంది నైపుణ్యాలను యాజమాన్య సంస్థలు కోరేటటువంటి ప్రమాణాలకు అనువుగా మెరుగు దిద్దడం కోసం ఈ కోర్సుల ను తీసుకు వస్తున్నారు.
- 150 ఉన్నత విద్యా సంస్థలు అప్రెంటిస్ శిప్ తో కూడిన డిగ్రీ/ డిప్లొమా కోర్సులను 2021 మార్చి నెల కల్లా ఆరంభించనున్నాయి.
- విద్యా రంగం లో ఎఫ్ డిఐ మరియు ఎక్స్ టర్నల్ కమర్శియల్ బారోయింగ్స్ కు వీలు కల్పిస్తారు.
- స్టడీ ఇన్ ఇండియా కార్యక్రమం లో భాగంగా ఆసియా దేశాల కోసం, అలాగే ఆఫ్రికా దేశాల కోసం ఇండ్-శాట్ ను ప్రతిపాదించడమైంది.
ఆర్థికాభివృద్ధి
పరిశ్రమ, వాణిజ్యం మరియు పెట్టుబడి
- పరిశ్రమ మరియు వాణిజ్యం ల యొక్క అభివృద్ధి, ప్రోత్సాహం ల కోసం 2020-21 సంవత్సరానికి 27,300 కోట్ల రూపాయల నిధులను కేటాయించడమైంది.
- ఇన్వెస్ట్ మెంట్ క్లియరెన్స్ సెల్ ను ఏర్పాటు చేయాలని, దీనిలో పనులను ఒక పోర్టల్ ద్వారా జరపాలని ప్రతిపాదించడమైంది:
- క్రొత్త గా అయిదు స్మార్ట్ సిటీస్ ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించడమైంది.
- మొబైల్ ఫోన్లు, ఇలెక్ట్రానిక్ సామగ్రి మరియు సెమి కండక్టింగ్ ప్యాకేజింగ్ ల తయారీని ప్రోత్సహించేందుకు ఒక పథకాన్ని తీసుకురావాలని ప్రతిపాదించడమైంది.
- నేశనల్ టెక్నికల్ టెక్స్ టైల్స్ మిశన్ ను ఏర్పాటు చేయడం జరుగుతుంది.
o 2020-21 నుండి 2023-24 మధ్య కాలంలో ఈ మిశన్ ను అమలు చేస్తారు.
o దీనికి గాను 1480 కోట్ల అంచనా వ్యయం అవుతుందని లెక్క వేశారు.
o భారతదేశాన్ని టెక్నికల్ టెక్స్ టైల్స్ లో ప్రపంచంలో అగ్రగామి దేశాల లో ఒకటిగా నిలబెట్టాలనేది దీని ధ్యేయం.
- ఎగుమతి సంబంధిత రుణాల ను అధిక స్థాయి లో మంజూరు చేసే లక్ష్యాన్ని సాధించడం కోసం నిర్ విక్ (NIRVIK) పేరు తో ఒక కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టబోతున్నారు:
ఇది
o ఉన్నత బీమా రక్షణ ను
o చిన్న ఎగుమతి సంస్థలకు ప్రీమియం లో తగ్గింపును
మరియు
o క్లెయిమ్ సెటిల్ మెంట్ కు సరళతరమైనటువంటి విధానాన్ని
ప్రసాదిస్తుంది.
- గవర్నమెంట్ ఇ-మార్కెట్ ప్లేస్ (జిఇఎమ్) యొక్క టర్నోవర్ ను 3 లక్షల కోట్ల రూపాయలకు చేర్చాలని లక్ష్యం గా పెట్టుకొన్నారు.
- ఎగుమతి చేసే ఉత్పత్తులపై సుంకాలు మరియు పన్నుల సవరణ కు ఒక పథకాన్ని ప్రవేశపెడతారు.
o ఎగుమతి సంస్థలకు కేంద్ర, రాష్ట్ర మరియు స్థానిక స్థాయిల లో విధించిన సుంకాలు మరియు పన్నుల లో ఇతరత్రా మినహాయింపు గానీ, లేదా రిఫండ్ గానీ లేకపోయినట్లయితే రిఫండ్ ను డిజిటల్ పద్ధతి లో పూర్తి చేస్తారు.
- ‘‘జీరో డిఫెక్ట్ – జీరో ఇఫెక్ట్’’ తయారీ అనే ప్రధాన మంత్రి దార్శనికతకు అనుగుణం గా అన్ని మంత్రిత్వ శాఖలు నాణ్యత పరమైన ప్రమాణాల కు సంబంధించిన ఉత్తర్వుల ను జారీ చేస్తాయి.
బడ్జెట్ స్వరూపం
మౌలిక సదుపాయాల రంగం
- మౌలిక సదుపాయాల రంగంలో తదుపరి 5 సంవత్సరాల కాలం లో 100 లక్షల కోట్ల రూపాయలను పెట్టుబడిగా తీసుకు వస్తారు.
- నేశనల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్:
o 103 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను 2019 డిసెంబర్ 31వ తేదీ నాడు ప్రారంభించడమైంది.
o వేరు రంగాల లో 6,500కు పైగా ప్రాజెక్టుల ను వాటి యొక్క పరిమాణం మరియు వాటి యొక్క అభివృద్ధి దశలను బట్టి వర్గీకరించడం జరుగుతుంది.
- జాతీయ లాజిస్టిక్స్ విధానాన్ని త్వరలోనే వెల్లడించడం జరుగుతుంది:
o కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల తో పాటు, కీలకమైన నియంత్రణ సంస్థల భూమికల ను దీనిలో స్పష్టం చేయనున్నారు.
o సింగిల్ విండో ఇ-లాజిస్టిక్ మార్కెట్ ను నెలకొల్పుతారు.
o ఉద్యోగ కల్పన ప్రావీణ్య సాధన మరియు ఎంఎస్ఎంఇ లను పోటీ పడే విధంగా తయారు చేయడం పై ప్రత్యేకంగా దృష్టిని సారిస్తారు.
- మౌలిక సదుపాయాల రంగానికి అవసరమైన విధం గా నైపుణ్యాల అభివృద్ధి అవకాశాలను కల్పించడం పై నేశనల్ స్కిల్ డివెలప్ మెంట్ ఏజెన్సీ ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది.
- మౌలిక రంగ ప్రాజెక్టుల కోసం ప్రాజెక్టు సన్నాహక సదుపాయాన్ని ఒకటి ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడమైంది.
o దీనిలో యువ ఇంజినీర్లు, మేనేజ్ మెంట్ పట్టభద్రులు మరియు విశ్వవిద్యాలయాల ఆర్థికవేత్తల కు క్రియాశీల భాగస్వామ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది.
- స్టార్ట్-అప్ లలో యువ శక్తి ప్రమేయాన్ని కల్పించే దిశ గా ప్రభుత్వాని కి చెందిన ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఏజెన్సీలు పాటుపడతాయి.
- 2020-21లో రవాణా సంబంధిత మౌలిక సదుపాయాల కల్పన కోసం 1.7 లక్షల కోట్ల నిధులను ప్రతిపాదించడమైంది.
లోటు కు సంబంధించిన ఆర్థిక సహాయానికి సాధనాలు
హైవేస్:
- హైవేస్ ను శీఘ్ర గతి న అభివృద్ధి పరచడం జరుగుతుంది:
దీనిలో
o 2500 కి.మీ మేర యాక్సెస్ కంట్రోల్ హైవేస్
o 9000 కి.మీ మేర ఎకనామిక్ కారిడోర్ లు
o 2000 కి.మీ కోస్తా తీరం మరియు నౌకాశ్రయ రహదారులు.
o 2000 కి.మీ మేర వ్యూహాత్మక హైవేలు
భాగం గా ఉంటాయి.
- ఢిల్లీ-ముంబయి ఎక్స్ ప్రెస్ వే మరియు రెండు ఇతర ప్యాకేజీల ను 2023 కల్లా పూర్తి చేయడం జరుగుతుంది.
- చెన్నై-బెంగళూరు ఎక్స్ ప్రెస్ వే పనులను మొదలు పెట్టడం జరుగుతుంది.
- 2024 కన్నా ముందే 6000 కి.మీ.కి పైగా హైవే బండిల్స్ ను నగదు గా మార్చుకోవాలని ప్రతిపాదించడమైంది.
భారతీయ రైల్వేలు:
- అయిదు ఆలోచన లు:
o రైలు మార్గాల ప్రక్కన రైల్వేల యాజమాన్యం లోని భూమి లో భారీ సౌర విద్యుత్తు ఉత్పాదక కేంద్రాల ను ఏర్పాటు చేయడం జరుగుతుంది.
o నాలుగు స్టేశన్ లను అభివృద్ధి చేసే పథకాల తో పాటు, పిపిపి పద్ధతి న 150 ప్యాసింజర్ రైళ్ళ నిర్వహణ ను చేపట్టడం జరుగుతుంది.
o ప్రముఖ పర్యటక స్థలాలకు తేజస్ తరహా రైళ్ళ ను మరిన్ని వేయడం జరుగుతుంది.
o ముంబయి-అహమదాబాద్ ల మధ్య హై స్పీడ్ రైలు కు సంబంధించిన పనిని చురుకు గా చేపట్టడం జరుగుతుంది.
o 18,600 కోట్ల రూపాయల వ్యయం తో 148 కి.మీ. పొడవున సాగే బెంగళూరు శివారు రవాణా పథకాన్ని చేపట్టడం జరుగుతుంది. దీని చార్జీలు మెట్రో తరహా లో ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం 20 శాతం ఎక్విటీ ని సమకూర్చుతుంది. ప్రాజెక్టు వ్యయం లో 60 శాతం వరకు వెలుపలి నుండి సహాయానికి మార్గం సుగమం చేస్తుంది.
భారతీయ రైల్వేల విజయాలు
550 స్టేశన్ లలో వై-ఫై సదుపాయాల ను ప్రారంభించడమైంది.