ఫిబ్రవరి 1, రంగా రెడ్డి: నందిగామ మండలం
చేగూర్ గ్రామంలో రామ చంద్ర మిషన్
ఆద్వర్యం లో నిర్మించిన ప్రపంచం లోనే అతిపెద్ద ధ్యాన మందిరాన్ని భారత
రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆదివారం ప్రారంభించనున్నారు. ఆదివారం ఉదయం
ప్రత్యేక విమానం లో కాన్హా ఆశ్రమానికి చేరుకొని ఆశ్రమ ప్రాంగణం లో
మొక్కలు నాటుతారు. అనంతరం దాదాపు ఒక లక్ష మంది ఒకే సారి ధ్యానం
చేసుకొనేందుకు వీలుగా నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరాన్ని
రాష్ట్రపతి ప్రారంభిస్తారు. కాగా, రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లను రంగా
రెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ గత రెండు రోజులనుండి స్వయంగా
పర్యవేక్షిస్తున్నారు. నేడు కూడా మహబూబ్ నగర్ కలెక్టర్ రోనాల్డ్ రోస్,
శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి తో కలసి ఆఏర్పాట్లను పరిశీలించారు.
హెలిపాడ్ లో రాష్ట్రపతి దిగగానే ధ్యాన మందిరం ప్రధాన వేదికకు వెళ్లే
మార్గం లో మాక్ కాన్వాయ్ ను నిర్వహించారు. పోలీస్, వైద్య ఆరోగ్య శాఖ,
అగ్నిమాపక శాఖ,రోడ్లు,భవనాలు, పంచాయితీ రాజ్, రెవిన్యూ,రవాణా, విద్యుత్,
సమాచార పౌర సంబంధాల శాఖ, కన్హా ఆశ్రమం ప్రతినిధులతో కలెక్టర్ అమోయ్
కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు.