బుధవారం టీఎస్ ఐఐసీ ప్రధాన కార్యాలయంలో మెగా ఇండస్ట్రియల్ పార్కులపై రూపొందించిన 2020 నూతన సంవత్సర క్యాలెండర్ ను టీఎస్ ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్, సివిల్ సప్లైస్ కార్పోరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, టీఎస్ ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, సీఈవో మధుసూదన్ గార్లు విడుదల చేసారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ గారు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న మెగా ఇండస్ట్రియల్ పార్కుల ఫోటోలను ఆసక్తిగా తిలకిస్తూ వాటి అభివృద్ధి పనుల గురుంచి టీఎస్ ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు గారితో చర్చించారు.
టిఎస్ఐఐసి క్యాలెండర్ ఆవిష్కరణ,ఆకర్షణగా మెగా ఇండస్ట్రీయల్ పార్కుల చిత్రాలు