ఎల్.బి.నగర్.నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న శాసనసభ్యులు శ్రీ.దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారిని అభినందించిన తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు శ్రీ.కల్వకుంట్ల తారకరామారావు గారు.
ఈ రోజు ఎల్.బి.నగర్ శాసనసభ్యులు శ్రీ.దేవిరెడ్డి సుదీర్ రెడ్డి గారు నియోజకవర్గ పరిధిలోని పలు అభివృద్ధి అంశాలపై గౌరవ తెలంగాణ మున్సిపల్ శాఖమాత్యులు శ్రీ.కల్వకుంట్ల తారకరామారావు గారిని కలవడం జరిగింది. ఇట్టి సమావేశంలో అరవింద్ కుమార్ గారు (ప్రిన్సిపాల్ సెక్రటరీ-మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ &అర్బన్ డెవలప్మెంట్), లోకేష్ కుమార్(జీ.హెచ్.ఏం.సీ.కమిషనర్), సిక్త పట్నాయక్(ఎల్.బి.నగర్.జోనల్ కమిషనర్) సురేష్ కుమార్(చీఫ్ ఇంజినీర్)గార్లు మరియు ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు. దానిలో భాగంగా సుదీర్ రెడ్డి గారు మాట్లాడుతూ ముఖ్యంగా ఎల్.బి.నగర్ నియోజకవర్గ పరిధిలోని ఇంటి టాక్స్ ల విషయం గురించి,రిజిస్ట్రేషన్ సమస్యల గురుంచి,డబల్ బెడ్ రూమ్స్ ప్రారంభోత్సవం మరియు ఇతర అంశాలపై చర్చించడం జరిగింది. దానికి స్పందించిన మంత్రివర్యులు తారకరామారావు గారు మాట్లాడుతూ, వచ్చే ఫిబ్రవరి మొదటిమాసంలో ఎల్.బి.నగర్ నియోజకవర్గ పరిధిలో ప్రజలకు మంచి తీపి వార్త తెలియజేస్తాము అని హామీ ఇచ్చారు. అలాగే రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కారంలో భాగంగా కొన్ని న్యాయపరమైన చిక్కులు,అవాంతరాలు ఉన్నాయి కాబట్టి,వచ్చే అసెంబ్లీ సమావేశాల అనంతరం తప్పకుండా రిజిస్ట్రేషన్ సమస్యలు తీర్చుతాము అని హామీ ఇచ్చారు. అలాగే సుదీర్ రెడ్డి గారు ఆటో నగర్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న బస్ టెర్మినల్ ఫోటోలతో కూడిన చిత్రపటాలు మరియు హిందు,ముస్లిం,క్రిస్టియన్ కులాల వారికి అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక సదుపాయాలతో నిర్మిస్తున్న గ్రేవీ యార్డ్ మరియు స్మశానవాటిక చిత్రపటాలను మంత్రి గారికి చూపెట్టడం జరిగింది. దానికి వారు ఎంతో సంతృప్తి చెంది,అక్కడే ఉన్న ప్రభుత్వ ఉన్నత అధికారులకు అట్టి నమూనా ఫోటోలు చూపెడుతూ,ప్రతి ఒక్కరు సుదీర్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని, నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడాలని కోరారు. ప్రతి పని ప్రజల కోసం ఉపయోగపడలనే వారి తపన అభినందనీయం అని కొనియాడారు. అలాగే ఎల్.బి.నగర్ నియోజకవర్గ పరిధిలోని విన్నూతంగా చేసే ప్రతి ఒక్క కార్యక్రమాలకు నా వంతు సహాయసహకారాలు ఎప్పుడు ఉంటాయి అని సుదీర్ రెడ్డి గారికి తెలిపారు. రాబోయే రోజుల్లో ఎల్.బి.నగర్ నియోజకవర్గన్ని అద్భుతమైన,అన్ని హంగులతో కూడిన నియోజకవర్గంగా సుదీర్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు కావున ప్రతి ఒక్కరు తమ,తమ సహాయసహకారాలు సుదీర్ రెడ్డి గారికి అందజేయాలని కోరారు. అలాగే నియోజకవర్గ పరిధిలో నిర్మించి ఉన్న డబల్ బెడ్ రూమ్స్ ప్రారంభోత్సవం వచ్చే ఫిబ్రవరి మాసంలో ప్రారంభించి,అర్హులైన పేదలకు ఇవ్వడం జరుగుతుంది అని మంత్రివర్యులు తెలపడం జరిగింది.
ఎల్బీనగర్ రిజిస్ట్రేషన్ సమస్యలు తీర్చుతా:మంత్రి కెటిఆర్ హామీ