రంగారెడ్డి జిల్లా ను మరింత అభివృద్ధి చేస్తాం: జిల్లా మంత్రి సబితా ఇంద్రారెడ్డి

 


 జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం గురువారం
ఖైరతాబాద్ లోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ చైర్ పర్సన్ అనితారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన రంగారెడ్డి జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో హాజరైన విద్యా
శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి,  ఎంపీలు రంజిత్ రెడ్డి,  కోమటిరెడ్డి  వెంకటరెడ్డి, ఎం.ఎల్.సి ఎగ్గే మల్లేశం, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
జెడ్పిటీసీలు, ఎం.పీ.పీలు, జిల్లా  అధికారులు పాల్గొన్నారు. మొదటగా వ్యవసాయంపై చర్చ జరిగింది.
     ఈ సందర్బంగా విద్యా శాఖ మంత్రి మాట్లాడుతూ  రైతుబందు క్రింద ఖరీఫ్ లో 1,93,531 మంది రైతులకు రూ.221.47
కోట్లను అందించాం. 4 వ విడత రైతు బందు నిధులు రైతుల అకౌంట్లలో గత మూడు
రోజుల నుండి జమ కావడం ప్రారంభమైందన్నారు. గత బకాయిలను విడుదల చేయించడానికి వ్యవసాయ శాఖ మంత్రితో ఎప్పటికప్పుడు కోరుతున్నామన్నారు.
రైతులకు రైతు బంధు, రైతు బీమాపై గ్రామాల వారీగా అవగాహన  కల్పించాలన్నారు.
        అనంతరం ఉపాధి హామీపై జరిగింది. మంజూరైనా పెన్షన్లు త్వరలో పంపిణీ
చేయడం జరుగుతుందన్నారు.
        జిల్లాలో 2019-20 ఆర్థిక సంవత్సరంలో 7997 స్వయం సహాయక మహిళా
సంఘాలకు రూ. 260.21 కోట్లను బ్యాంక్ లింకేజీ కల్పించామని,  1,74,583
మందికి సామాజిక భద్రతా పింఛన్లను అందిస్తున్నామని, సంక్షేమానికి రాష్ట్ర
ప్రభుత్వం పెద్దపీట వేసి చేపట్టిన పథకాలన్నింటినీ రంగారెడ్డి జిల్లాలో
సమర్దవంతంగా అమలవుతున్నాయని చైర్పర్సన్ అనితా రెడ్డి అన్నారు.
       *జిల్లాలో ఈ సంవత్సరం  పదవ తరగతి  పరీక్షల్లో మంచి ఫలితాలు
వచ్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని,  ప్రతీ ఉన్నత పాఠశాలలో ఒక గంట
అదనపు క్లాసులను నిర్వహిస్తున్నామని,  జెడ్పిటీసీ, ఎంపీపీ లు కూడా పదవ
తరగతిలో మంచి ఫలితాలు వచ్చేలా స్థానికంగా వున్న ఉన్నత పాఠశాలపై ప్రత్యేక
దృష్టి పెట్టాలని, జిల్లాలో అన్ని పాఠశాలలు,  హాస్టళ్లలో బిల్లుల బకాయిల
పేరుతొ కరెంట్ కట్ చెయ్యొద్దని కరెంట్ కట్ చేసిన వాటన్నింటినీ వెంటనే
పునరుద్ధరించాలని విధ్యుత్ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.
      అన్ని పాఠశాలల్లో రూ. 3.50 కోట్లతో టాయిలెట్లు,  మౌలిక సదుపాయాలను
కల్పిస్తున్నామని, అన్ని పాఠశాలల్లో దశలవారీగా  సైన్స్ లాబ్ లను ఏర్పారు
చేస్తున్నామని  జెడ్పి చైర్మన్ అనితా రెడ్డి అన్నారు.
        మిషన్ భగీరథపై సమీక్షిస్తూ..నల్లా కనెక్షన్లకోసం తవ్విన గుంతలను
వెంటనే పూడ్చివేసి, నాణ్యమైన బీటీ రోడ్లను వేయాలన్నారు. హాస్టళ్లకు,
స్కూల్లకు నీటి కొరత లేకుండా చూడాలని, మిషన్ భగీరథ అధికారులను మంత్రి
ఆదేశించారు. అదేవిధంగా గ్రామాల్లో మోతాదుకు మించి అధిక లోడ్ వాహనాలు
తిరగకుండా చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.
     జిల్లాలోని కొన్ని అంగన్వాడీలకు మరుగుదొడ్లు లేవని, మరుగుదొడ్ల
ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పలువురు సభ్యులు సూచించారు.
     జిల్లాలోని కొత్త గ్రామ పంచాయతీ లకు రేషన్ దుకాణాల ఏర్పాటుకు చర్యలు
తీసుకోవాలని సభ్యులు కోరారు., భూమి క్రయ, విక్రయాల సెస్సు, మినరల్ సెస్సు
వాటా గ్రామ పంచాయతీలకు అందేలా చర్యలు తీసుకోవాలని సభ్యులు సూచించారు.
కందులను మద్దతు ధరకు కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకోవాలని, అమన్ గల్ లో
అగ్రికల్చర్ డివిజన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, ఫిజు రియంబర్స్
మెంట్, హాస్టళ్ల మరమ్మత్తులకు చర్యలు తీసుకోవాలని పలువురు సూచించారు.