చౌటుప్పల్ లో మూడెకరాల భూమిలో గోతి తీసి రసాయన వ్యర్ధాల డంప్

ఒకప్పుడు అది పచ్చని పంటలతో కళకళలాడింది. నేడు కాలుష్యం కోరల్లో చిక్కుకుని విళవిళలాడుతున్న పరిస్థితి. అదే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ప్రాంతం. వందలాది కంపెనీలు నిబంధనలకు నీళ్ళోదిలి వ్యర్థ రసాయనాలను తమ కంపెనీలో బోర్లు వేసి భూముల్లోకి వదులుతున్న పరిస్థితి. పలు కంపెనీలు రాజకీయ నాయకుల ,బడా బాబుల కనుసన్నల్లో నడుస్తున్నవే కావడంతో ఫిర్యాదు చేస్తే గాని స్పందించని పరిస్థితి. స్ధానిక ప్రజలు ఎన్ని ఫిర్యాదులు చేసిన పిసిబి అధికారుల చర్యలు శూన్యం. 


అది కాలుష్య కారక చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం గ్రామం. అక్కడ జింక్,కాఫర్ ఉత్పత్తులు తయారు చేసే మెగాస్ మెటల్ పరిశ్రమ.ఈ ఉత్పత్తిలో అనేక రసాయన వ్యర్ధాలు ఉత్పత్తి అవుతుంటాయి. వాటిని మెదక్ ప్రాంతంలోని  రసాయన శుద్ధి కేంద్రానికి పంపించాలి. దీనికి నెలకు లక్షల్లో ఖర్చు అవుతుంది. ఇక్కడే కంపెనీ ఖర్చు లేకుండా ఒక దొంగ ప్లాన్ దొరలా అమలు చేసింది..కంపెనీ ప్రాంతంలో కొనుగోలు చేసిన 3 ఎకరాల భూమిలో పెద్ద ఎత్తున గోతులు తీసి రసాయన ఘన వ్యర్ధాలను‌ డంప్ చేసింది.ఎన్నో ఏండ్లుగా గుట్టు చప్పుడు కాకుండా అందరిని మేనేజ్ చేసి ఈ వ్యవహరం నడిపారు. ఆ భూమిలో ఇటుకలు‌ తయారు చేసినట్టు సృష్టించారు. వారు డంప్ చేసిన రసాయన వ్యర్ధాలలో కాఫర్,సీసం, కాడ్మియం, క్రోమియం లు వాతావరణ కాలుష్యానికి కారకాలు.  డంపింగ్ చేసిన వ్యర్ధాలు భూమిలో ఉండి భూమి కలుషితం అవుతుంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో కాలుష్యం కోరల్లో చిక్కుకుని విళవిళలాడుతున్న పరిస్థితి నెలకొంది. 


ఇటీవల చౌటుప్పల్ మండలం లో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరుగుతుండటంతో భూముల రేట్లు కోట్ల రూపాయలు పలుకుతోంది.దీంతో మెగాస్ కంపెనీ యాజమాన్యం ఈ కాలుష్య భూమిని వదిలించుకొనే భాగంగా అమ్మి వేయడం జరిగింది. దీంతో వారు వెంచర్ వేయడానికి భూమిని చదును చెసే క్రమంలో భారీ వ్యర్ధాల డంపింగ్ బయటపడటంతో అది ఆగిపోయింది. ఇది ఆనోటా ఈ నోటా ప్రజలకు చేరి వాతవరణ కాలుష్య నియంత్రణ మండలి (పిసిబి) అధికారులకు ఫిర్యాదు చేశారు. 


దీంతో పిసిబి అధికారుల బృందం డంప్ చేసిన ప్రాంతంలో భూగర్భంలో ఉంచిన వ్యర్ధాల శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపినట్టు సమాచారం. 


కాలుష్య కారకమైన చౌటుప్పల్ మండలం లో ని కంపెనీలపై పిసిబి విజిలెన్స్ అధికారులు అకస్మీక తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.


డంపింగ్ ప్రాంతంలో శాంపిల్స్ సేకరించి హైదరాబాద్ ల్యాబ్ కు పంపినం:పిసిబి ఇన్విరాన్మెంటల్ ఇంజనీర్ బిక్షపతి


తమకు ఫిర్యాదు అందడంతో మెగాస్ మెటల్ పరిశ్రమ డంపింగ్ యార్డ్ లో శాంపిల్స్ సేకరించి హైదరాబాద్ ల్యాబ్ కు పంపినట్టు వెల్లడించారు. ప్రస్తుతం ఈ కంపెనీ మూతపడిందని చెప్పారు.తమకు ల్యాబ్ నివేదిక వచ్చిన తరువాత చర్యలు తీసుకుంటామని చెప్పారు.